BREAKFAST||మనం అల్పాహారంలో తీసుకొనే మినపప్పు వలన కలిగే లాభాలు...
మినపప్పు వలన కలిగే లాభాలు :
మాంసకృత్తులు ఎక్కువుగా పప్పులో ఉంటాయి. విటమిన్ బీ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఆయుర్వేదలో 'మాషా' అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారు.మినపప్పు ప్రతిరోజు తీసుకోవడం వలన తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావొచ్చు.
- ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ , కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
- పేగు ఆరోగ్యాన్ని (గట్ హెల్త్) మెరుగుపరుస్తుంది:
- శరీరంలోని ఐరన్ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది
- గుండెను ఆరోగ్యంగా,దృడంగా ఉంచేలా చేస్తుంది.
- నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు.
- మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.. మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదే
- శరీరం యొక్క బరువు తగ్గించటంలో లో మినప పప్పు చాలా ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
- మూత్రపిండాలు కాపాడటంలో కూడా మినపప్పు ఉపయోగపడుతుంది.
0 Comments
please do not enter any spam link in the comment box