LATEST POSTS

10/recent/ticker-posts

Joint Entrance Examination (Main)-2024 || రేపు జాయింట్ ఎంట్రన్స్ ఎక్సమినేషన్ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల

 JEE -2024 || జేఈఈ మెయిన్‌ (JEE Main) రెండో సెషన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల 

Joint Entrance Examination (Main)-2024 || రేపు జాయింట్ ఎంట్రన్స్ ఎక్సమినేషన్ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్‌ కార్డులు విడుదల

JEE 2024 /జేఈఈ మెయిన్‌ (JEE Main) రెండో సెషన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు (Admit Card) రేపు విడుదల కానున్నాయి. రేపు (ఏప్రిల్‌ 1న) అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు ఏప్రియల్  4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు. భారత్‌ దేశం అవతల  22 పట్టణాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్‌-1 (బీఈ లేదా బీటెక్‌) పరీక్షను, పేపర్‌-2 ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బీ (బీఆర్క్‌, బీప్లానింగ్‌) పరీక్షను ఏప్రిల్‌ 12న నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న పరీక్షా  ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్‌ సెషన్‌-1  జనవరిలో ముగిసిన జరిగింది.జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 లో  23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ మార్కులు సాధించారు. వారిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు.తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు చొప్పున 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు.

Post a Comment

0 Comments