ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) భారీగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది.అర్హత, ఆసక్తి కలిగినవారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పీజీ డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్రెంటిస్ చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం 1110 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ రీజియన్‌లో 76 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 20వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు సంఖ్య : 1110
ఖాళీల వివరాలు :
1.సౌథర్న్ రీజియన్-1 హైదరాబాద్ : 76,
2.సౌథర్న్ రీజియన్-2 బెంగళూరు : 114,
3.కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్) : 44,
4.నార్తర్న్ రీజియన్ : 313,
5.ఈస్టర్న్ రీజియన్ 156,
6.నార్తీస్టర్న్ రీజియన్ : 127,
7.ఒడిశా ప్రాజెక్ట్ : 53,
8.వెస్టర్న్ రీజియన్ : 227
విద్యా అర్హతలు : ఐటీఐ అప్రెంటిస్ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, డిప్లొమా అప్రెంటిస్ కోసం సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం బీఈ, బీటెడ్, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి.
వయో పరిమితి : 18 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా
స్టయిఫండ్ : ప్రతి నెల రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభం: జూలై 21,2021
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20,2021
APPLY ONLINE : CLICK HERE
WEBSITE: CLICK HERE


0 Comments
please do not enter any spam link in the comment box