LATEST POSTS

10/recent/ticker-posts

AISSEE-2023 || సైనిక్ స్కూల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల

AISSEE-2023 || సైనిక్ స్కూల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల 

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో 6వ,9వ తరగతి లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది

AISSEE-2023 || సైనిక్ స్కూల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల

AISSEE-2023 || సైనిక్ స్కూల్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదల 

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్‌ స్కూళ్లలో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల ప్రవేశపరీక్ష ప్రకటనను ఎన్‌టీఏ విడుదల చేసింది. 

అర్హతలు : ప్రస్తుతం 5వ తరగతి,8వ తరగతి చదివే వారు అప్లై చేసుకోవచ్చు.

అమ్మాయిలు,అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు.

6వ తరగతి ప్రవేశం కోసం 10 నుండి12 సంవత్సరాల వయస్సు ఉండాలి. అనగా 01ఏప్రిల్2011 నుండి 31మార్చ్2013 మధ్య జన్మించి ఉండాలి

9వతరగతి ప్రవేశం కోసం13 నుండి 15సంవత్సరాల వయస్సు ఉండాలి.అనగా 01ఏప్రిల్ 2008 నుండి 31మార్చ్ 2010 మధ్య జన్మించి ఉండాలి.ప్రస్తుతం 2022-23 లో 8వ తరగతి చదువు తు ఉండాలి.9వ తరగతి కి బాలికలకు ప్రవేశం లేదు

ఆన్ లైన్ అప్లికేషన్ :

ప్రారంభ తేదీ:21-10-2022

చివరి తేదీ:30-11-2022

పరీక్ష తేదీ:08-01-2023 (ఆదివారం)

కావలసిన సర్టిఫికేట్లు :

కలర్ ఫోటో,లెఫ్ట్ తoబ్, సిగ్నేచర్, రెసిడెన్స్ సర్టిఫికేట్,బర్త్ సర్టిఫికేట్,కులం సర్టిఫికేట్,స్కూల్ సర్టిఫికేట్ (5వ,8వ).

ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023


Examination Schedule AISSEE – 2022



1.Online Submission of Application : Form 21.10.2022 to 30.11.2022 ( Upto 05.00 PM)

2 Last Date of Successful Transaction of Fee through  : Credit/Debit Card/NetBanking 30.11.2022(Upto 11.50 PM)

3 Correction of details filled in Application Form on Website only : 02.12.2022 to 06.12.2022

4 Downloading of Admit Cards from NTA website : Will be announced on the NTA website later.

5 Date of Examination : 8th January 2023(Sunday)


నేటి బాలలే రేపటి పౌరులు. నేటి విద్యార్థులే రేపటి త్రివిధ దళాధిపతులు. చక్కటి క్రమశిక్షణ, నాణ్యమైన విద్యనే కాకుండా ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌తో కూడిన సుశిక్షితులను తయారుచేయడానికి ఏర్పాటు చేసినవే సైనిక్‌ స్కూల్స్‌. దేశ రక్షణలోని త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను స్కూల్‌ లెవల్‌ నుంచే తయారుచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ (ఎస్‌ఎస్‌ఎస్‌) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్‌ స్కూళ్లలో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాల ప్రవేశపరీక్ష ప్రకటనను ఎన్‌టీఏ విడుదల చేసింది. 

ప్రవేశాలు కల్పించే తరగతులు

ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 సైనిక్‌ స్కూల్స్‌ ఉన్నాయి.


స్కూల్‌ ప్రత్యేకతలు : 

  1. సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలు పొందినవారికి సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
  2. పూర్తిస్థాయిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది.
  3. త్రివిధ దళాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు.
ఎవరు అర్హులు?

వయో పరిమితి : ఆరో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయస్సు మార్చి 31, 2023 నాటికి 10-12 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్యలో జన్మించినవారు అర్హులు. వయస్సు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి : తొమ్మిదో తరగతిలోకి ప్రవేశాల కోసం మార్చి 31, 2023 నాటికి 13-15 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్యపరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

గమనిక : SC,ST కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి కనీస మార్కులు లేవు.

ఎంపిక విధానం : జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్‌ ఇండియా సైనిక్‌ సూల్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) ద్వారా.

స్కూల్‌ ప్రత్యేకతలు

పరీక్ష విధానం : 

ఎంట్రన్స్‌ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

ఆరోతరగతి పరీక్ష విధానం : 

  • ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు.
  • 6వ తరగతి వారికి మధ్యాహ్నం 2pm to 4.30 pm (125 ప్రశ్నలు)
  • లాంగ్వేజ్‌ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు. మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు-150 మార్కులు. ఇంటెలిజెన్స్‌ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు. జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు-50 మార్కులు ఇస్తారు.
  • పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఎవరు ఏ భాషలోనైనా పరీక్ష రాయవచ్చు.

తొమ్మిదో తరగతి పరీక్ష విధానం : 

  • దీనిలో ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు.
  • మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్షలో మ్యాథ్స్‌-200, ఇంటెలిజెన్స్‌-50, ఇంగ్లిష్‌-50, జనరల్‌ సైన్స్‌-50, సోషల్‌ సైన్స్‌-50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.
  • తొమ్మిదో తరగతి పరీక్ష కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు.
  • 9వ తరగతి వారికి మధ్యాహ్నాం 2pm to 5pm (150 ప్రశ్నలు)

గమనిక : సాధారణంగా ప్రశ్నలు కనీస అర్హత తరగతి స్థాయిలో ఉంటాయి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్‌ ప్రకారం ఆ తరగతుల్లోని అంశాలను చదివితే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.

ముఖ్యమైన తేదీలు : 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అప్లికేషన్ ఫీజు : SC,ST వారికి 500,General,OBC వారికి 650 రూపాయలు ఉండును

దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: నవంబర్‌ 30

పరీక్షతేదీ : 2023, జనవరి 8

APPLY ONLIE : CLICK HERE

వెబ్‌సైట్‌లు : https://aissee.nta.nic.in

 వెబ్ చిరునామాలతో సైనిక్ పాఠశాలల జాబితా :


సైనిక్ స్కూల్           రాష్ట్రం పేరు స్కూల్ వెబ్‌సైట్

1. ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్, కోరుకొండ www.sainikschoolkorukonda.org
2. సైనిక్ స్కూల్, కలికిరి www.kalikirisainikschool.com
3. అరుణాచల్  ప్రదేశ్  సైనిక్ స్కూల్, ఈస్ట్‌సియాంగ్ http://www.sainikschooleastsiang.com
4. అస్సాం సైనిక్ స్కూల్, గోల్‌పారా www.sainikschoolgoalpara.org
5.బీహార్  సైనిక్ స్కూల్, నలంద http://sainikschoolnalanda.bih.nic.in/SSNL.html
6. సైనిక్ స్కూల్, గోపాల్‌గంజ్ http://www.ssgopalganj.in/
7. ఛత్తీస్‌గఢ్ సైనిక్ స్కూల్, అంబికాపూర్ http://sainikschoolambikapur.org.in/home.html
8. గుజరాత్ సైనిక్ స్కూల్, బాలచాడి https://www.ssbalachadi.org/
9.హర్యానా సైనిక్ స్కూల్, కుంజ్‌పురా https://www.sskunjpura.org/
10. సైనిక్ స్కూల్, రేవారి http://www.ssrw.org/
11. హిమాచల్  ప్రదేశ్  సైనిక్ స్కూల్, సుజన్పూర్ తీరా http://www.sainikschoolsujanpurtira.org/
12. J&K సైనిక్ స్కూల్, నగ్రోటా http://sainikschoolnagrota.com/
13. జార్ఖండ్ సైనిక్ స్కూల్, తిలయ్యా http://www.sainikschooltilaiya.org/
14. కర్ణాటక  సైనిక్ స్కూల్, బీజాపూర్ https://ssbj.in/
15. సైనిక్ స్కూల్, కొడగు http://sainikschoolkodagu.edu.in/
16. కేరళ సైనిక్ స్కూల్, కజకూటం https://www.sainikschooltvm.nic.in/
17 మధ్య  ప్రదేశ్  సైనిక్ స్కూల్, రేవా http://www.sainikschoolrewa.ac.in/
18. మహారాష్ట్ర  సైనిక్ స్కూల్, సతారా https://www.sainiksatara.org/
19. సైనిక్ స్కూల్, చంద్రపూర్ https://sainikschoolchandrapur.com/
20. మణిపూర్ సైనిక్ స్కూల్, ఇంఫాల్ https://ssimphal.nic.in/
21. మిజోరం సైనిక్ స్కూల్, చింగ్‌చిప్ https://ssimphal.nic.in/
22. నాగాలాండ్ సైనిక్ స్కూల్, పుంగ్ల్వా https://sainikschoolpunglwa.nic.in/
23. ఒడిషా  సైనిక్ స్కూల్, భువనేశ్వర్ http://sainikschoolbhubaneswar.org/
24. సైనిక్ స్కూల్, సంబల్పూర్ http://www.sainikschoolsambalpur.in/
25. పంజాబ్ సైనిక్ స్కూల్, కపుర్తలా http://www.sskapurthala.com/
26.రాజస్థాన  సైనిక్ స్కూల్, చిత్తోర్‌గఢ్ http://www.sschittorgarh.com/
27. సైనిక్ స్కూల్, ఝుంఝును https://ssjhunjhunu.com/
28. తమిళనాడు సైనిక్ స్కూల్, అమరావతినగర్ http://www.sainikschoolamaravathinagar.edu.in/
29. ఉత్తర ప్రదేశ్  సైనిక్ స్కూల్, మెయిన్‌పురి https://www.sainikschoolmainpuri.com/
30. సైనిక్ స్కూల్, ఝాన్సీ https://ssjhansi.co.in/
31. సైనిక్ స్కూల్, అమేథి https://sainikschoolamethi.com
32. ఉత్తరాఖండ్ సైనిక్ స్కూల్, ఘోరాఖల్ https://www.ssghorakhal.org/
33. పశ్చిమ బెంగాల్ సైనిక్ స్కూల్, పురూలియా http://sainikschoolpurulia.com/

Post a Comment

0 Comments