TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 1.మన జెండా
TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు
50 ముఖ్యమైన ప్రశ్నలు
1) తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది ?
A: జూన్ 2, 2014
2) తెలుగులో ప్రాజెక్టు పనులు ఎందుకొరకు ఏర్పాటు చేయబడినవి?
A: పఠనాభిలాషను, భావప్రసార నైపుణ్యాలను పెంపొందించుటకు
3) 5వ తరగతి తెలుగు లో ఒక్కో పాఠానికి ఎన్ని పనిదినాలు కేటాయించబడినవి?
A: 16పని దినాలు
4)ఒక పూర్తి పాఠం నిర్వహించడం అంటే ఎక్కడి నుండి ఎక్కడివరకు నిర్వహించడం?
A: ఉన్ముఖీకరణ చిత్రం నుండి నేనివి చేయగలనా వరకు
5) నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ అంశానికి ఎన్ని మార్కులు కేటాయించాలి?
A: i)పిల్లల భాగస్వామ్యం,(పుస్తక పఠనం,నివేదిక రాయడం) -10M
ii)పిల్లలు రాసిన అంశాలు(నోటు పుస్తకాలు)- 10M
iii)ప్రాజెక్టు పనులు-10M
iv)లఘు పరీక్ష-20M
6) వందేమాతరం...గేయం రచించింది ఎవరు?
A: బంకీంచంద్ర ఛటర్జీ
7) జాతీయ గీతం జనగణమన ....రచించింది ఎవరు?
A: రవీంద్రనాథ్ ఠాగూర్
8) భారత దేశం నా మాతృభూమి....ప్రతిజ్ఞ రచించింది ఎవరు?
A: పైడిమర్రి వేంకట సుబ్బారావు
9) 5వ తరగతి తెలుగులో ఆశించిన అభ్యసన ఫలితాలు ఎన్ని అంశాలు కలవు?
A: 10 అంశాలు
10) 5వ తరగతి లో ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?
A: 6 సంసిద్ధత పాఠాలు
11) మన జెండా పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: దేశభక్తి
12) మన జెండా పాఠం ప్రక్రియ ఏమిటి?
A: గేయం
13) మన జెండా గేయ రచయిత ఎవరు?
A: శేషం లక్ష్మీనారాయణాచార్య
14) సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం ఏమిటి?.
A: చదవడం ,రాయడం
15) సంసిద్ధత పాఠాల సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: అభ్యాసాలు
Pre by : G SURESH
మొత్తం పాఠం క్రింది pdf లో
0 Comments
please do not enter any spam link in the comment box