Graduates MLC || వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకుండిలా !
MLC |నల్గొండ,వరంగల్,ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం :
2023 శాసన సభకు జరిగినా ఎన్నికల్లో ఖమ్మం,వరంగల్,నల్గొండ,నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందడం వలన ఎమ్మెల్సీ స్తానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ స్థానానికి త్యరలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీరు ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీయొక్క డీటెయిల్స్ పూర్తి చేసి ఆన్లైన్లోనే ఫారం నింపి గ్రాడ్యుయేట్ ఓటరుగా గుర్తింపు పొందవచ్చు. లేదా ఫారం 18ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు నింపిన తర్వాత గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి మీ మండల సంబంధిత అధికారికి దరఖాస్తు ఫారంను ఇవ్వవచ్చు.
నోట్- గతంలో గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నా గాని ఇప్పుడు మరల దరఖాస్తు చేసిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కనుక గమనించగలరు.
FORM 18
APPLY ONLINE LINK : https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx
ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కొరకు ఆన్ లైన్ ద్వారా కావలసిన సర్టిఫికెట్స్
1) డిగ్రీ మెమో ఒరిజినల్ లేదా ప్రొవిషనల్ సర్టిఫికేట్.
2) ఓటర్ ఐడి కార్డు.లేదా ఎపిక్ నెంబర్,పోలింగ్ స్టేషన్ నెంబర్,మన ఓటు యొక్క సీరియల్ నెంబర్, నెంబర్,
3) పాస్ ఫోటో.
4) ఆధార్ కార్డు,ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్స్
5)ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడి.
6) నివాస ధ్రువీకరణ పత్రం
ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొనుటకు అర్హతలు :
1.ఏదైనా డిగ్రీ (ఓపెన్ డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే) 2020 - అక్టోబర్-31 లోపు పూర్తి చేసి ఉండాలి.
2.ఓటరు నమోదుకు ఆఖరు తేది 06.02.2024
OFF LINE :
ఆఫ్లైన్ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. FORM-18 దరఖాస్తు నింపి, సంబంధిత ధ్రువపత్రాలపై గెజిటెడ్ అధికారితో అటేస్టేషన్ చేయించి తహసిల్దార్ లేదా ఆర్డీఓ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు.
WEBSITE : https://ceotelangana.nic.in
0 Comments
please do not enter any spam link in the comment box