LATEST POSTS

10/recent/ticker-posts

SSC JOB NOTIFICATION || ARMY JOBS || పదో తరగతి అర్హత తో ఉద్యోగాలు

SSC || పదో తరగతి అర్హత తో ఉద్యోగాలు 

SSC JOB NOTIFICATION || ARMY JOBS ||  పదో తరగతి అర్హత తో ఉద్యోగాలు


మొత్తం ఖాళీల సంఖ్య : 24,369

పదో తరగతి అర్హత తో ఉద్యోగాలు


పదోతరగతి ఉత్తీర్ణతతో అవకాశం. మంచి జీతభత్యాలు, దేశసేవలో పాల్గొనే అవకాశం. భరోసానిచ్చే కొలువు. వీటన్నింటి సమాహారమే బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్‌ వంటి సాయుధ బలగాల్లో కొలువులు. వివిధ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఆ పోస్టుల అర్హతలు, ఖాళీల సంఖ్య,పరీక్ష విధానంపై సంక్షిప్తంగా పాఠకుల కోసం…

సాయుధ బలగాలు (సీఏపీఎఫ్‌) : 

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లను సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)గా పిలుస్తారు.

నోట్‌ : వీటిలో పురుషులకు (ఎస్సీ-3377, ఎస్టీ-1930, ఓబీసీ-4815, ఈడబ్ల్యూఎస్‌-2115, జనరల్‌-9342)-21,579 పోస్టులు. మహిళలకు (ఎస్సీ-429, ఎస్టీ-246, ఓబీసీ-580, ఈడబ్ల్యూఎస్‌-221, జనరల్‌-1150)-2626 పోస్టులు కేటాయించారు.

విద్యా అర్హతలు : 2023, జనవరి 1 నాటికి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎత్తు :  పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.


వయో పరిమితి : 2023, జనవరి 1 నాటికి 18-23 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2000, జనవరి 2 నుంచి 2005, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేండ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (సీబీఈ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

బలగాల వారీగా ఖాళీలు:

బలగం ఖాళీల సంఖ్య

బీఎస్‌ఎఫ్‌ : 10497

సీఐఎస్‌ఎఫ్‌ : 100

సీఆర్‌పీఎఫ్‌ : 8911

ఎస్‌ఎస్‌బీ : 1284

ఐటీబీపీ : 1613

ఏఆర్‌ : 1697

ఎస్‌ఎస్‌ఎఫ్‌ : 103

ఎన్‌సీబీ : 164

మొత్తం ఖాళీలు : 24369

పీఈటీ/పీఎస్‌టీ :

కంప్యూటర్‌ బేస్ట్‌ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)లకు ఎంపిక చేస్తారు.

పీఈటీలో పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాలలో, 1.6 కి.మీ.దూరాన్ని ఆరున్నర నిమిషాలలో పరుగెత్తాలి.

మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాలలో, 800 మీటర్ల దూరాన్ని నాలుగు నిమిషాలలో పరుగెత్తాలి.

కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌  ముఖ్యతేదీలు


160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.

పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌/హిందీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో ఉంటుంది.

పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు.

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌

నోట్‌: సీబీఈని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది. మిగిలిన పరీక్షలను సీఏపీఎఫ్‌ నిర్వహిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో



దరఖాస్తు చేయుటకు చివరితేదీ : నవంబర్‌ 30

సీబీఈ : 2023, జనవరిలో ఉంటుంది

FULL NOTIFICATION : CLICK HERE

వెబ్‌సైట్‌ : https://ssc.nic.in

Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box