LATEST POSTS

10/recent/ticker-posts

School Assembly 22-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-22-11-2022

School Assembly 22-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-22-11-2022

School Assembly 22-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-22-11-2022

School Assembly 19-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-19-11-2022

నేటి వార్తల ముఖ్యాంశాలు


1.దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్‌-5 రాష్ర్టాల్లో తెలంగాణ 5స్థానం దక్కించుకున్నది.

2.కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

3.హైదరాబాద్‌ వేదికగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోళ్ల పరిశ్రమ ప్రదర్శన(ఎక్స్‌పో)- 2020 నిర్వహించనున్నారు

4. 1955 తరువాత ఇనాం భూములను కొనుగోలు చేసిన వారికి ఆధీన ధ్రువీకరణ పత్రం(ఓఆర్‌సీ) పొందే హక్కు గాని, దరఖాస్తు చేసుకునే హక్కు గాని లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

5.వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి తొలి విడత సంయుక్త కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

6.రాష్ట్రంలో మే నెలలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలు, ఆగస్టులో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల ధ్రువపత్రాలను (లాంగ్‌ మెమోలు) పాఠశాలలకు పంపించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. 

7.భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

8.ఇండియానేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు కాగా, దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది.

9.ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియాతో స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారుచేసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

10. సెర్బియా యోధుడు నోవాక్‌ జొకోవిచ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రికార్డును సమం చేస్తూ ఆరోసారి ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.


 నేటి సుభాషితం

"ఎన్ని చదువులు చదివిన,ఎన్ని శాస్త్రాలు ఔపోశన పట్టినా దుష్టబుద్ది గలవాడు తన స్వభావాన్ని మార్చుకోలేడు."
                
"Go confidently in the direction of your dreams! Live the life you've imagined"

మంచి పద్యం

కర్మ నిష్టుడు కావలె ధర్మముగను
పనియు గల్పించు కొని ఫలవంతముగను
ఆయువున్నంత కాలము అవనియందు
మార్గ మితరంబు లేదింక మానవులకు

నేటి జీ.కె

ప్రశ్న: విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

జ: థామస్‌ అల్వా ఎడిసన్‌


School Assembly 22-11-2022


Today News

> IIT Madras, Tamil Nadu govt join hands to improve learning experience of school students

> Indonesia's Java island hit by strong earthquake; at least 56 dead

> Nirmala Sitharaman to meet State FMs for pre-Budget consultation on November 25

> Supreme Court dismisses plea to frame ‘guidelines’ for implementing its own judgments

> Nearly 3 million technical, scientific terms in all modern Indian languages soon to be searchable online

> AP Aqua University to become a reality after years of delay

> As Biden turns 80, Americans ask ‘What’s too old?’

> England vs Iran, FIFA World Cup 2022 Score: Saka doubles the lead, ENG 2-0 IRA

Proverb/ Motivation

A new day is like a new painting. Draw lines with prayers. Erase mistakes with forgiveness. Dip the brush with lots of patience and color it with love and respect.

నేటి ఆణిముత్యం

విడువ ముడువ లేక కుడువగట్టగలేక
వెరపులేక విద్యవిధము లేక
వెడలలేనివాని నడపీను గనరొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యము: సమయం సందర్భాలకూ తగినట్టుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడూ, ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు, లోకానికి మంచి చెడ్డలకు భయపడనివాడు, విద్యాహీనుడు, నలుగురిలో కలిసి మెలిసి మెలగనివాడు, క్రమ పద్ధతి లేనివాడు నడిచే శవంగా పరిగణించబడతాడు.

 Today's GK

Q: What is the national sport of Hungary?

A: Water Polo is the national game of Hungary.

Post a Comment

0 Comments