LATEST POSTS

10/recent/ticker-posts

School Assembly 19-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-19-11-2022

 School Assembly 19-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-19-11-2022

School Assembly 19-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-19-11-2022

School Assembly 19-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-19-11-2022

నేటి వార్తల ముఖ్యాంశాలు

1.తెలంగాణ  రాష్ట్రంలో BC,EBC విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన రుసుములకు ప్రభుత్వం రూ.650.31 కోట్లు విడుదల చేసింది.

2.తెలంగాణ  ప్రభుత్వం విద్యార్థినుల సౌకర్యార్థం హెల్త్‌-హైజెనిక్‌ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

3.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్స్‌ అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

4.దివ్యాంగులపై వేధింపులకు పాల్పడినా, వారి గౌరవానికి, హక్కులకు భంగం కలిగించినా.. వారిపై దివ్యాంగుల హక్కుల చట్టం కింద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. 

5.తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) వెబ్‌సైట్‌ను 27 దేశ, విదేశీ భాషల్లో అందుబాటులోకి తెచ్చామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

6.పంజాబ్‌లో ఉద్యోగులకు  2004లో నిలిపివేసిన పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) మళ్లీ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని కేబినెట్‌ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

7.పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 7న ప్రారంభమై.. 29వ తేదీ వరకు జరగనున్నాయి

8.వివిధ నేరాల్లో శిక్షలుపడి జైల్లో ఉన్న ఖైదీలకూ ఆధార్‌ నమోదుచేయాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేసింది.

9.ఏసీలను కేవలం రూ.2 వేల ఖర్చుతోనే ఎయిర్‌ ప్యూరిఫయర్లుగా మార్చే సాంకేతికతను ఐఐటీ-కాన్పుర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు పరిశోధకులు అభివృద్ధిచేశారు. 

10.భారత్ తో త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు  సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు

11.చేతన్‌ శర్మ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీపై శుక్రవారం బీసీసీఐ వేటు వేసింది.

12. ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్-2022 రేపటి నుంచి ఖతర్ లో ప్రారంభం కానుంది.

నేటి సుభాషితం


"కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా."

                

"Believe deep down in your heart that you're destined to do great things"


మంచి పద్యం

నీతి వచనాలు పల్కుట భీతిలేక

సులభ మెవ్వరికైనను చూడచూడ

ఆచరించుట కష్టము అవనిమీద

ఆచెరించెడు మనుజుండు అమరుడగును

చరిత్రలో ఈ రోజు :

  • భారత దేశ మొట్ట మొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేడు.
  • నేడు స్వాతంత్ర్య  సమరయోధురాలు వీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయ్ జయంతి.

నేటి ఆరోగ్య సూత్రం

ప్రతిరోజు 40నిమిషాలు వ్యాయామం చేయడం వలన గ్యాస్థ్రిక్ ప్రాబ్లమ్, షుగర్,థైరాయిడ్ వంటి సమస్యలు మన దరికి చేరవు.

నిన్నటి జీకే ప్రశ్న⁉️

Q) గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు ఏది?

A: మీథేన్

నేటి జీకే ప్రశ్న❓

Q) ప్లాస్టర్ ఆఫ్ పారీస్(POP) యొక్క రసాయనిక సంకేతం ఏమిటి?

నేటి జీ.కె

ప్రశ్న: రెండు ఆవేశాల మధ్య ఉన్న బలాన్ని వివరించే నియమం ఏది?*

జ: కూలుంబ్‌ నియమం


School Assembly in English 19-11-2022

School Assembly in English 19-11-2022


TODAY'S NEWS – HEADLINES


> Winter session of Parliament from December 7: Pralhad Joshi


> Ferment in Congress over pension reform U-turn; leaders flag ‘lack of consultation’


> After human kill in border village, Telangana officials now suspect a young tiger on prowl


> Kamala Harris to convene leaders meeting over North Korea missile launch, says White House official


> SC says rising trend to scandalise courts; issues contempt notices


> SC worried as 454 seats remain vacant after open round of INI-CET counselling stopped


> For the first time, six women officers clear defence services staff course exam


> BCCI sacks entire Chetan Sharma-led selection committee, invites applications for vacated positions


Proverb/ Motivation


Fear is not real. Fear is simply the product of thoughts that you create. Danger is very real, but fear is a choice.


నేటి ఆణిముత్యం


పనస తొనలకన్న పంచదారలకన్న

జుంటుతేనే కన్న జున్ను కన్న

చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి

విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యము: పనస తొనలు, పంచదార, తేనె, జున్ను వీటన్నింటికంటే యువతుల మాటలే మిక్కిలి మధురంగా ఉంటాయి.


Today's GK


Q: Name the largest flower in the world?

A: Rafflesia arnoldii

Post a Comment

0 Comments