LATEST POSTS

10/recent/ticker-posts

School Assembly 18-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-18-11-2022

School Assembly 18-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-18-11-2022

School Assembly 18-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-18-11-2022

School Assembly 18-11-2022 || పాఠశాల అసెంబ్లీ కోసం-18-11-2022

1.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠ శాలలో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ లు (వీటీఎం) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆదేశించారు.

2.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 8 నుంచి 12వ తరగతి చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా శానిటరీ హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ నాప్కిన్‌ కిట్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

3.రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు.

4.‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ రూపొందించిన భారత మొట్టమొదటి ప్రైవేట్‌ రాకెట్‌ ఈరోజు ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి విక్రమ్‌-ఎస్‌ సిరీస్‌ రాకెట్‌ ఆకాశంలోకి దూసుకుపోనున్నది.

5.కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే ఎలాంటి ప్రయత్నమైనా రాజ్యాంగ సవరణే అవుతుందని కేంద్రం పేర్కొంది.

6.గ్యాస్‌ సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌లు తగిలించనున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ట్విట్టర్‌లో వెల్లడించారు.

7.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది.

8.పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

9.మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా బన్సి గ్రామం, గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్‌ఫోన్‌ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగా నిలిచింది.

10.తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.

నేటి సుభాషితం

"ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా మన సంకల్పాన్ని వదలకూడదు."

"Don't watch the Clock; do what it does. Keep going "


మంచి పద్యం

నెరసు లెరిగి తన్ను సరిదిద్దు కొనువాడు

భద్ర మార్గ మందు పదిల పడును

వృద్ధి జెందు నతడు సిద్ధిని పొందును

ప్రభవు దయకు కూడా పాత్రుడగును


నేటి ఆరోగ్య సూత్రం :


సంగీతం వినడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది..


నిన్నటి జీకే ప్రశ్న⁉️


Q) రక్త పీడనం(BP )కొలిచే సాధనం పేరేమిటి?


A: స్ఫిగ్మోమానోమీటర్


నేటి జీకే ప్రశ్న❓

Q) గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు ఏది?

నేటి జీ.కె

ప్రశ్న: ఇళ్లల్లో వాడే రెండు తీగల మధ్య పొటెన్షియల్‌ భేదం ఎంత?*

జ: 240 V


School Assembly 18-11-2022 || School Assembly 18-11-2022 


Today News in English


> NMMSS 2022: National Merit cum Means Scholarship deadline extended to November 30


> India part of meeting on Kabul: ‘Military facilities of others in country unacceptable’


> Relaunching old pension scheme potential source of fiscal risks for states, says CAG


> India’s first privately built rocket set for launch today


> AYUSH 2022 Counselling: Round 1 seat allotment result on November 18;


> Climate talks deadlocked over loss and damage finance, Indian proposal also in trouble


> UK’s Jeremy Hunt hikes taxes, tightens grip on spending in tough budget


> Wishlist for India in T20Is: Ultra-aggressive openers, batters who can bowl


Proverb/ Motivation

Become so confident in who you are that no one's opinion, rejection, or behavior can rock you.


నేటి ఆణిముత్యం

హీను డెన్ని విద్య లిల నభ్యసించిన

ఘనుడుగాడు మొఱకు జనుడెగాని

పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె

విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యము: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.

Today's GK


Q: In Vemulawada Chalukyas who had the title Solandganda?


A: Baddega –I

Post a Comment

0 Comments