LATEST POSTS

10/recent/ticker-posts

CBIL Score | సిబిల్ స్కోర్ కాపాడుకోవాలంటే.. ఏం చేయాలో తెలుసా?!

 CBIL Score | సిబిల్ స్కోర్ కాపాడుకోవాలంటే.. ఏం చేయాలో తెలుసా?! 

CBIL Score | సిబిల్ స్కోర్ కాపాడుకోవాలంటే.. ఏం చేయాలో తెలుసా?!


CBIL Score | మీరు ఐటీ కంపెనీలోనూ.. మ‌రేదైనా కార్పొరేట్ కంపెనీలో ప‌ని 

చేస్తున్నారా.. అయితే, ఉన్న‌త‌స్థాయి అధికారిగా ప‌నిచేసినా.. సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌ని చేసినా.. ఫ్యామిలీ అవ‌స‌రాల విష‌యంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. ఎవ‌రి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌నైనా క్రెడిట్ స్కోర్ తేల్చి చెబుతుంది. క్రెడిట్ స్కోర్ బేష్షుగ్గా ఉంటే ప్ర‌యోజ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. మీకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వివిధ రుణాలు పొందొచ్చు. ఆ రుణాలు తేలిగ్గా పొంద‌డానికి ఈ క్రెడిట్ స్కోర్ ఒక ఆయుధంగా మారుతుంది. అంత కీల‌క‌మైన ఈ క్రెడిట్ స్కోర్ ఒక్కోసారి త‌గ్గిపోతూ ఉండొచ్చు. అటువంట‌ప్పుడు ఏం చేయాలి.. అందుకు కార‌ణాలేమిటి.. చేయాల్సిందేమిట‌న్న‌ది తెలుసుకుందామా..!


రుణాలు ఇలా చెక్ చేసుకోవాలి


మీ క్రెడిట్ స్కోర్ త‌గ్గిపోయింద‌ని గుర్తించ‌గానే ఆ నివేదిక‌ను ఓసారి ప‌రిశీలించండి. మీకు తెలియ‌కుండా ఏదైనా రుణం ఖాతా మీ ఖాతాలో చేరిందా? అనే విష‌యం చెక్ చేసుకోండి. తీసుకున్న రుణాల‌పై నెల‌వారీ వాయిదాల చెల్లింపులు ఎప్పుడైనా ఆల‌స్య‌మైందా.. క్రెడిట్ కార్డ్‌బిల్లు మొత్తం చెల్లించారా.. త‌నిఖీ చేసుకోవాలి. కొన్ని సంద‌ర్భాల్లో ఒక‌టి, కంటే ఎక్కువ కార‌ణాల వ‌ల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. క్రెడిట్ స్కోర్ నివేదిక‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే అది త‌గ్గిపోవ‌డానికి కార‌ణాలు తెలుసుకుని మ‌ళ్లీ క్రెడిట్ స్కోర్ గాడిలో ప‌డేలా చేయొచ్చు.


స‌జావుగా ఈఎంఐ చెల్లింపులు సాగాలి


కొన్ని సార్లు అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈఎంఐలు ఆల‌స్యంగా చెల్లించినా.. వాటిని ప‌ట్టించుకోక‌పోయినా క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. ఒక‌సారి నెల‌వారీ రుణ వాయిదా స‌కాలంలో చెల్లించ‌క‌పోయినా త‌ర్వాత క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ స‌రి చేయ‌వ‌చ్చు. ప్ర‌తి సారీ ఆల‌స్య‌మైతే క్రెడిట్ స్కోర్ పెరగ‌డం గానీ, పెంచుకోవ‌డం గానీ సాధ్యం కాదు. గడువు ప్ర‌కారం నెల‌వారీ వాయిదాల చెల్లింపులు మీ బాధ్య‌త‌. దీన్ని ప‌ట్టించుకోకుంటే భ‌విష్య‌త్‌లో మీకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


లిమిట్‌కు లోబ‌డే క్రెడిట్ కార్డు వాడ‌కం


క్రెడిట్ కార్డుల‌ను ఎల్ల‌వేళ‌లా ప‌రిమితికి లోపే వాడాలి. క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతానికి పైగా వాడితే మీరు పూర్తిగా రుణాల‌పైనే ఆధార‌ప‌డుతున్నార‌ని బ్యాంకులు నిర్ధార‌ణ‌కు వ‌స్తాయి. క‌నుక 90 శాతం వాడితే క్రెడిట్ స్కోర్ మీద ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. అప్పుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నా క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. త‌క్కువ అప్పులు తీసుకున్నా వాటి సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం ఇబ్బందిక‌ర‌మే. ఇవ‌న్నీ క్రెడిట్ స్కోర్ నివేదిక‌లో ఉంటాయి. క‌నుక చిన్న రుణాలు తీర్చేసి పెద్ద రుణాలు కొన‌సాగించినా మంచిదే కానీ.. అన‌వ‌స‌ర రుణాల కోసం ఎవ‌రినీ సంప్ర‌దించ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు.


సైబ‌ర్ మోసాలు చెక్ చేయండిలా


ఏండ్ల త‌ర‌బ‌డి వాడుతున్న క్రెడిట్ ర‌ద్దు చేసుకుంటే తాత్కాలికంగా సిబిల్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది. రుణ అర్హ‌త త‌గ్గిపోయి.. రుణ చ‌రిత్ర‌లో పాత క్రెడిట్ కార్డు వివ‌రాలు లేక‌పోవ‌డం దీనికి కార‌ణం. తొలిసారి మీరు తీసుకున్న క్రెడిట్ కార్డును సాధ్య‌మైనంత మేర ర‌ద్దు చేసుకోవ‌ద్దు. ఎప్ప‌టిక‌ప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు సైబ‌ర్ ఫ్రాడ్‌లు పెరిగిపోతున్న నేప‌థ్యంలో మీకు సంబంధం లేని రుణాలు క‌నిపిస్తే బ్యాంకులు, రుణ సంస్థ‌ల దృష్టికి తీసుకెళ్లి స‌రి చేసుకోవాల‌ని చెబుతున్నారు.

Post a Comment

0 Comments