TS TET SPECIAL || 5TH CLASS EVS || 4.పౌష్టికాహాం
1) చిరు ధాన్యాలకు ఉదాహరణ ..
A: వరి గోధుమ జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలు సామలు కొర్రలు ....
2)శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు?
A: పిండి పదార్థాలు(కార్బో హైడ్రేడ్స్)
3) చిరుధాన్యాలలో అధికంగా ఉండేది ఏది?
A: పిండిపదార్థాలు
4)వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో అధికంగా ఉండే పదార్థం ఏది?
A: కొవ్వు
5) పప్పు ధాన్యాలకు ఉదాహరణ
A: శనగలు ,పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు ,చిక్కుడు ...
6) పుండ్లను మాన్పడంలో ఏ పోషకపదార్థాలు అవసరం?
A: ప్రోటీన్లు(మాంసకృత్తులు)
7) ప్రోటీన్లు అధికంగా వేటిలో ఉంటాయి?
A: పప్పు ధాన్యాలలో మరియు గుడ్లు ,మాంసం, పాలు
8)ఎముకల పెరుగుదలకు ఉపయోగపడేది ఏది?
A: కాల్షియం
9) పాలల్లో అధికంగా ఉండే మూలకం ఏది?
A: కాల్షియం
10)రక్తంలో అధికంగా ఉండే మూలకం ఏది?
A: ఇనుము
11)ఎముకలు దంతాలలో అధికంగా ఉండే మూలకం ఏది?
A: కాల్షియం ,పాస్పరస్
12) వ్యాధులను ఎదుర్కునేవి ఏవి?
A: విటమిన్లు ,ఖనిజ లవణాలు
13)రోగాలు తట్టుకునే శక్తిని ఇచ్చేవి ఏవి?
A:విటమిన్లు ,ఖనిజ లవణాలు
14) మన ఆరోగ్య సంరక్షకాలు అని వేటిని అంటారు?
A: విటమిన్లు ,ఖనిజ లవణాలు
15)శరీర పెరుగుదలకు ఉపయోగపడేవి ఏవి?
A: పాలు గుడ్లు మాంసం
16) శరీరానికి ఏమేమి అవసరం?
A: పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు
17) సమతుల ఆహారం అనగానేమి?
A: పిండిపదార్థాలు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజ లవణాలు అన్నీ కలిసి ఉన్న ఆహారం
18) శరీర భాగాలు మొహం ఉబ్బడానికి కారణం
A: శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలు తీసుకోకపోవడం
19)కాళ్ళు చేతులు సన్నగా అవడానికి కారణం
A:శక్తినిచ్చేవి మరియు శరీర పెరుగుదలకు తోడ్పడే ఆహార పదార్థాలకు తీసుకోక పోవడం
20) ఒక టమోటా నుండి ఎన్ని కేలరీల శక్తి లభిస్తుంది?
A: 22కేలరీలు
21) శీతల పానీయాల బదులు ____ తాగడం ఆరోగ్యానికి మంచిది
A: నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పండ్లరసాలు
22) ఏమి తినడం వల్ల స్థూలకాయులుగా మారే అవకాశం ఉంది?
A: జంక్ ఫుడ్
23) శరీరానికి శక్తినిచ్చేవి ఏవి?
A: కార్బోహైడ్రేట్లు కొవ్వులు నూనెలు
24) శరీర పెరుగుదలకు ఉపయోగపడేవి ఏవి?
A: ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు
25) వ్యాధినిరోధక శక్తిని ఇచ్చేవి ఏవి?
A: విటమిన్లు ఖనిజ లవణాలు
G.SURESH
0 Comments
please do not enter any spam link in the comment box