LATEST POSTS

10/recent/ticker-posts

TS TET-2022 || 5వ తరగతి తెలుగు || 3.సాలార్ జంగ్ మ్యూజియం

 TS TET -2022 5వ తరగతి తెలుగు 3.సాలార్ జంగ్ మ్యూజియం

TS TET-2022 SPECIAL 5వ తరగతి తెలుగు 3.సాలార్ జంగ్ మ్యూజియం

 TS TET -2022 || 5వ తరగతి తెలుగు 

1) సాలార్ జంగ్ మ్యూజియం పాఠం ఇతివృత్తం ఏమిటి?.

A: దర్శనీయ స్థలాలు,చరిత్ర

2)సాలార్ జంగ్ మ్యూజియం పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?

A: డైరీ

3) సాలార్ జంగ్ మ్యూజియం పాఠం ఉద్ధేశం ఏమిటి ?

A: మ్యూజియం అందులో భద్రపరిచే వస్తువులను వాటి ప్రాశస్త్యాన్ని ఉద్ధేశాన్ని పిల్లలకు తెలుపడం

4) హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ వస్తుప్రదర్శనశాల ఏది?

A: సాలార్ జంగ్ మ్యూజియం

5) సాలార్ జంగ్ మ్యూజియం ఏ నది ఒడ్డున కలదు ?

A: మూసీ నది

6) సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎక్కువ వస్తువులను, కళాఖండాలను సేకరించిన నిజాం ప్రభువు ఎవరు?

A: మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్ జంగ్ -III.

7) సాలార్ జంగ్ మ్యూజియం ఏ ఆకారం లో కలదు ?

A: అర్థచంద్రాకారం

8)సాలార్ జంగ్ మ్యూజియం ఎప్పుడు ప్రారంభించబడింది ?

A: 1951 డిసెంబర్ 16

9) భారతదేశం లో ఉన్న మ్యుజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది?

A: 3 వ స్థానం

10) సాలార్ జంగ్ మ్యూజియంలో మొత్తం ఎన్ని అర్రలు ఉన్నాయి?

A: 38

11) అర్ర అనగా  అర్థం ఏమిటి?

A: గదులు

12) అశ్వదళం అనగా అర్థం ఏమిటి?.

A: గుర్రాలు

13)సాలార్ జంగ్ మ్యూజియంలో  అతిముఖ్యమైనది ఏది?

A: గంటల గడియారం

 14) పాలరాతి శిల్పాల అర్రలో ఉన్న అతిముఖ్యమైన శిల్పం ఏది?

A: రెబ్బెక్కా శిల్పం.

15) రెబ్బెక్కా శిల్పం చెక్కింది ఎవరు?

A: జి.బి.బెంన్ జోని(ఇటలీ)

16) రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏమిటి ?

A: ఒక ఆడమనిషి పరదాకప్పుకుని ఆ పరదాలోనుండి చూసినట్లు  ఉంటుంది

17) టిప్పు సుల్తాన్ కు కుర్చీలు,టీపాయ్ లు బహూకరించిన రాజు ఎవరు?

A: ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI

18) సాలార్ జంగ్ మ్యూజియంలో ముందునుండి చూస్తే ఆడ మనిషి,వెనుక భాగం అద్దంలో చూస్తే మగ మనిషి కనిపించే శిల్పం లో వాళ్ళ పేర్లు ఏమిటి?

A: మెఫిస్టోఫిలిప్స్(ముందు)

      మార్గరిట్టా(వెనుక)

19) మెఫిస్టోఫిలిప్స్  , మార్గరిట్టా లు ఎవరు ?

A: జర్మన్ దేశంలో పరదర్శించే నాటకంలోని పాత్రలు

20) సాలార్ జంగ్ మ్యూజియంను జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది ఎవరు?

A: భారత పార్లమెంట్

21)  సాలార్జంగ్ మ్యూజియం పాఠం విన్న విద్యార్థి తను కూడా డైరీ రాయడం మొదలు పెడితే   ఆ విద్యార్థి సాధించిన సామర్థ్యం ఏమిటి ?

A: సృజనాత్మక

22) హైదరాబాదు లో గల ప్రముఖ జంతుప్రదర్శనశాల పేరేమిటి?

A: నెహ్రూ  జూలాజికల్ పార్క్

23) నకిష అనగా  అర్థం ఏమిటి ?

A: కొయ్యబొమ్మలు చెక్కేవారు

24) రెండు రూపాల శిల్పం ఏ శతాబ్ధానికి చెందినది?

A: 19వ శతాబ్దం(ఫ్రాన్స్) 

25) అగ్గి పెట్టె సైజులో ఉన్న ఖురాన్  ను ఎక్కడ చూడవచ్చు?

A: సాలార్ జంగ్ మ్యూజియంలో

Post a Comment

0 Comments