LATEST POSTS

10/recent/ticker-posts

TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు || 7.నేను..గోదావరిని

 TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు || 7.నేను ..గోదావరిని

TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు || 7.నేను..గోదావరిని

TS TET-2022 SPECIAL || 4వ తరగతి తెలుగు

గమనిక: ఇవి నాలుగవ తరగతి టెక్ట్ బుక్ ఆధారంగా రూపొందించినవి.కొన్ని ప్రాంతాలు కొత్తజిల్లాల ఆధారంగా మారి ఉండొచ్చు. గమనించగలరు.


1) నేను..గోదావరిని పాఠం ఇతివృత్తం ఏమిటి?

A: దర్శనీయ స్థలాలు

2) నేను..గోదావరిని పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?

A: ఆత్మకథ

3) నేను..గోదావరిని పాఠం ఉద్దేశం ఏమిటి ?

A: తెలంగాణలోని గోదావరి ఒడ్డున గల దర్శనీయ స్థానాల గురించి తెలుపడం ఈ పాఠం ఉద్దేశం

4) గోదావరి నది ఎక్కడ పుట్టింది?

A: మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గర గల త్రయంబక్ వద్ధ

5) గోదావరి ఏ యే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?

A:   మహారాష్ట్ర ,తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్

6)  ఈ పాఠంలో పిల్లలతో ఎవరు మాట్లాడారు?

A: గోదావరి

7) సమస్తజీవకోటికి మూలాధారమైనది ఏది?

A: నీరు

8) నాగరికథలకు మూలమైనది ఏది?

A: నీరు

9) నదీతీర ప్రాంతాలలో ఏమి వెలిశాయి?

A: పుణ్యక్షేత్రాలు

10) గంగానది ఎక్కడ పుట్టింది?

A: హిమాలయాలలో

11) దక్షిణ భారతదేశలో ఎక్కువ దూరం ప్రవహించే నది ఏది?

A: గోదావరి

12) దక్షిణ గంగ అని ఏ నదికి పేరు?

A: గోదావరికి

13)గోదావరి ని 'తెలివాహ నది ' అని కూడా పిలుస్తారు. ఎందుకనగా ..

A: తెల్లగా ఉంటుంది కాబట్టి

14) గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?

A: నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర

15) నిజామాబాద్ లో గోదావరి లో కలిసే ఉప నదులు ఏవి?

A: మంజీరా,హరిదా.

16) సంగమేశ్వర  ఆలయం ఎక్కడ కలదు?

A: నిజామాబాద్ జిల్లాలో

17) ప్రపంచంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ కలదు?

A: ఆదిలాబాదు జిల్లాలో

18) అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం గల ప్రాంతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?

A: బాసర

19)సరస్వతీ మూర్తిని ఇసుకతో ప్రతిష్ఠించింది ఎవరు?

A: వేదవ్యాసుడు

20)  తమ పిల్లలను బళ్ళో చేర్చేముందు  ఎక్కడ ఓనమాలు దిద్దిస్తారు?.

A: బాసరలోని సరస్వతీ దేవాలయంలో

21)పిల్లలకు మంచిగా చదువు రావాలని తల్లిదండ్రులు బిక్షాటనచేసి నిద్రించే సంప్రదాయం ఎక్కడ కలదు?

A: బాసరలో

22) పోచంపాడు వద్ద గోదావరిపై కట్టిన ఆనకట్ట పేరేమిటి?.

A: శ్రీరాంసాగర్

23) శ్రీరాంసాగర్ నుండి గోదావరి ఏ జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుంది?

A: నిర్మల్

24) గోదావరి నది ఏడు పాయలుగా చీలి సప్తగోదావరిగా ఎక్కడ ప్రవహిస్తుంది?

A: బాదనకుర్తి వద్ద

 25) ధర్మానికి ప్రసిద్ధి  అయిన ఊరు ఏది?

A: ధర్మపురి

 G.SURESH

Post a Comment

0 Comments