LATEST POSTS

10/recent/ticker-posts

KVR CA & GK MCQ 01.01.2022

53 వ టైగర్ రిజర్వ్ గా ఏ రాష్ట్రంలోని నేషనల్ పార్కుని ఎంచుకున్నారు?
KVR CA & GK MCQ 01.01.2022


1.2022-ప్రపంచ ఫుట్ బాల్(FIFA-నవంబర్-21-డిసెంబర్-8) కప్ వేదిక?

1.చైనా 

2.జపాన్ 

3.ఖతర్ 

4.న్యుజిలాండ్.


2.ఇటీవల కేంద్ర ప్రభుత్వం వస్త్రాల పై GST 5శాతం నుంచి ఎంత మేరకు పెంచటం వివాదాస్పదంగా మారింది?

1.12 

2.18 

3.17 

4.10.


3. 2022 జనవరి 1నుంచి  11 వరకు జరిగే 32 వ పుస్తక మహోత్సవాన్ని  ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో AP గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఎక్కడ ప్రారంభించారు?

1.ఇందిరాగాంధీ స్టేడియం 

2.స్వరాజ్ మైదాన్ 

3.ACA క్రికెట్ స్టేడియం 

4.బెంజి సర్కిల్.


4.1834 లో భారత శిక్షా స్మృతి (IPC-ఇండియన్ పీనల్ కోడ్)  ని రూపొందించిన ఈ క్రింది భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు ఎవరు?

1.విలియం బెంటిక్ 

2.థామస్ బ్యబింగ్టన్ మెకాలే 

3.వారెన్ హెస్టింగ్స్

4.లార్డ్ మౌంట్ బాటన్.

వివరణ : IPC ఆమోదం-1860, చట్టం అమలు-1862 జనవరి-1.


5.అమెజాన్ "పాపులర్ బుక్ ఆఫ్ ది ఇయర్-2021 బిజినెస్ అండ్ కనామిక్స్ విభాగంలో ఎంపికైన "ది రోరింగ్ లాంబ్స్" పుస్తక రచయిత ఎవరు?

1.చేతన్ భగత్(న్యూఢిల్లీ) 

2.శ్రీకాంత్ బెవర(AP-విశాఖ)

3.కబీర్ బేడీ(పంజాబ్)

4.రవీందర్ సింగ్(కోల్ కత్తా).


6.డిజిటల్ అంతరాలను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం 2015 లో డిజిటల్ ఇండియా కార్యక్రమం చేపట్టింది. అయితే భారత్ నెట్ కార్యక్రమం క్రింది ఏ సం:రం నాటికి 2.50 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించనుంది?

1.2022 

2.2023 

3.2024 

4.2025.


7.2021 -అమెరికా కు చెందిన స్వచ్చంధ సంస్థ SPI విడుదల చేసిన ప్రపంచ దేశాల సామాజిక ప్రగతి సూచీ లో 168 దేశాలలో భారత్ స్థానం?

1.101 

2.139 

3.115 

4.144

వివరణ-మొదటి స్థానం నార్వే.


8.ప్రముఖ కన్నడ రచయిత శాంతి నాధ్ దేశాయ్ రచించిన "ఓం నమో" పుస్తకాన్ని తెలుగులోకి అనువధించినందుకు గాను 2020 సం:రానికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఈ క్రింద కర్నూల్ జిల్లా సాహితీ వేత్త ఎవరు?

1.గోరటి. వెంకన్న 

2.రంగనాథ రామచంద్రరావు.

3అనామిక 

4.దయా ప్రకాష్ సిన్హా 

అకాడమీ ప్రస్తుత చైర్మన్-చంద్ర శేఖర కంబార.


9.ఇటీవల రైల్వే బోర్డ్ చైర్మన్, CEO గా నియమితులైన ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఎవరు?

1.వినయ్ కుమార్ త్రిపాఠి

2.సునీల్ శర్మ

3.వినోద్ కుమార్

4.అశ్విని లోహాని


10.బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను భారతదేశం ఏ దేశ సహాయంతో సంయుక్తంగా రూపొందించింది.

1.అమెరికా 

2.ఇజ్రాయెల్ 

3.రష్యా 

4.ఫిలిపైన్స్.

నోట్-ఫిలిపైన్స్ వీటిని కొంటుంది.


11.53 వ టైగర్ రిజర్వ్ గా ఏ రాష్ట్రంలోని నేషనల్ పార్కుని ఎంచుకున్నారు?

1.ఛత్తీస్ ఘడ్ 

2.జార్ఖండ్ 

3.ఉత్తరాఖండ్ 

4.కర్ణాటక

నోట్-గురు గాసీదాస్ నేషనల్ పార్క్.


12.2021 -ఆసియా అండర్-19 పురుషుల క్రికెట్ కప్ విజేత?

1.శ్రీలంక 

2.పాకిస్థాన్

3.ఆప్ఘనిస్థాన్ 

4.భారత్

నోట్-భారత్ ఇప్పటివరకు 8 సార్లు విజేత .


13.కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల)చట్టం ను ఏ సం:రం లో రూపొందించింది?

1.1955 

2.1935 

3.1958 

4.1962


14.దేశవ్యాప్తంగా 2021 సం:రం లో 126 పులులు మరణించగా 44 పులులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో మరణించాయి?

1.మహారాష్ట్ర 

2.కర్ణాటక 

3.మధ్యప్రదేశ్ 

4.తెలంగాణ.

నోట్-ప్రపంచంలో అత్యధికంగా పులులు ఉన్న దేశం-ఇండియా 2967. అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం-మధ్యప్రదేశ్-526.

ప్రస్తుతం భారత్ లో ఉన్న టైగర్  రిజర్వ్ లు-53.

మన జాతీయ జంతువు-రాయల్ బెంగాల్ టైగర్(పాంథెరా టైగ్రిస్)-1972 

అంతర్జాతీయ పులుల దినోత్సవం-జూలై-29.


15.దేశంలోనే తొలిసారి విద్యుత్ బ్యాటరితో నడిచే బోటు "ముజిరిస్" ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

1.మధ్యప్రదేశ్ 

2.కేరళ 

3.పశ్చిమ బెంగాల్ 

4.ఆంధ్రప్రదేశ్.

నోట్-ప్రపంచంలో బ్యాటరితో నడిచే అతి పెద్ద బోటు. 

10 నాటికల్ మైళ్ళు/గంట.

ప్రయాణ సామర్ధ్యం-100మంది

ఛార్జ్ సమయం-15 నిమిషాలు.

బ్యాటరీ అయిపోతే డీజిల్ తో పనిచేస్తుంది....

              సమాధానాలు

1.3      6.2    7.3   8.2

2.1       9.1  10.3  11.1

3.2       12.4   13.3

4.2.       14.3    15.2

5.2                          

నూతన సంవత్సర శుభాకాంక్షలు తో మీ.....

కొపనాతి.వీర్రాజు

81065 25320

 ఉద్యోగ ప్రాప్తిరస్థు

KVR CA & GK MCQ 01.01.2022 PDF : DOWNLOAD CLICK HERE

Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box