LATEST POSTS

10/recent/ticker-posts

తెలంగాణలోని మైనార్టీ జూనియ‌ర్ కాలేజీల్లో జేఎల్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS)
తెలంగాణలోని మైనార్టీ జూనియ‌ర్ కాలేజీల్లో జేఎల్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం



తెలంగాణ లోని 111 తెలంగాణ మైనారీటీస్‌ సొసైటీ (TMR) జూనియ‌ర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ తెలంగాణ మైనారీటీస్‌ సొసైటీ(TMR) జూనియ‌ర్ కాలేజీల్లో ఈ నియామ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఇవే కాకుండా 12 టీఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ సంస్థలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుండి జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది.ఈ పోస్టులు అన్ని కూడా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకం జరుగుతుంది.ఈ పోస్టుల భర్తీ కోసం సొసైటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

NOTE : ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జ‌ర‌గ‌నున్నాయి. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లేదా సాధారణ జూనియర్ లెక్చరర్ల బదిలీ ద్వారా నియామకాలు జరిగినప్పుడు వీరి సేవలు రద్దు చేయబడతాయి. 

TELANGANA MINORITIES RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (TMREIS).


విద్యాఅర్హతలు : 

1.దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MA/MSc/MCom) హోల్డర్ లేదా సంబంధిత సబ్జెక్టులో నుండి 50 శాతం కంటే తక్కువ మార్కులు కలిగి ఉండ‌రాదు.

2.జూనియర్ లెక్చరర్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ మెథడాలజీతో NCTE ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి BEd లేదా తత్సమాన డిగ్రీ అవసరం. 

3.ఏదైనా గుర్తింపు పొందిన మాధ్యమిక పాఠశాల/జూనియర్ కళాశాలలో XI నుండి XII లేదా ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించడంలో మూడు సంవత్సరాల కన్నా తక్కువ కాకుండా అనుభవం అవసరం. 

 4.ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకేషనల్ నిర్వహణలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

5. ఏదైనా గుర్తింపు పొందిన ఒకేషనల్ జూనియర్ కళాశాలలో XI నుండి XII వరకు తరగతులు నిర్వ‌హించిన అనుభ‌వం క‌లిగిఉండాలి.


TELANGANA MINORITIES RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (TMREIS).


ముఖ్యమైన తేదీలు : 

జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపిక : ఆగస్టు 16 న 

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వ‌హ‌ణ‌. 

ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ కోసం రాత పరీక్ష : ఆగస్టు 6 న 

ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 2 

జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం చివరి తేదీని పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ఓ అధికారి చెప్పారు.


సిలబస్ : 

రెండు పోస్టులకు జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, పెడ‌గాజీ, సంబంధిత స‌బ్జెక్ట్‌లో అభ్య‌ర్థుల‌ను ప‌రీక్షిస్తారు. 

రాత ప‌రీక్ష 100 మార్కుల‌కు, ఇంట‌ర్వ్యూ 50 మార్కుల‌కు ఉంటుంది. 

అర్హత, ఆసక్తి గ‌ల‌ అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి సమర్పించవచ్చు. 



స‌బ్జెక్ట్‌ల వారీగా జూనియర్ లెక్చరర్ల ఖాళీలు :

1.ఇంగ్లీష్: 111

2.ఉర్దూ: 111

3.తెలుగు: 111

4.గణితం: 80

5.భౌతికశాస్త్రం: 63

6.కెమిస్ట్రీ: 63

7.వృక్షశాస్త్రం: 63

8.జంతుశాస్త్రం: 63

9.చరిత్ర: 31

10.అర్థశాస్త్రం: 48

11.పౌరశాస్త్రం: 48

12.వాణిజ్యం: 48

13. ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల ఖాళీలు : 85

Post a Comment

0 Comments