- LRSకు దరఖాస్తు చేసుకొని వారికి అవకాశం కల్పించింది.
- దీనికొరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో LRS కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు దరఖాస్తు చేసుకొనివారు కూడా భవన నిర్మాణాలకు అనుమతి కోరవచ్చు. దీని కొరకు ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. ప్రభుత్యం LRS మార్గదర్శకాలను చెల్లించాల్సిన ఫీజులు నిర్దేశిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థలు జిహెచ్ఎంసి హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలను ఈ యొక్క ఉతర్వులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
'LRS మార్గదర్శకాలు విడుదల'
1.2020 ఆగస్టు 28 వ తారీఖు నాటికి రిజిస్ట్రేషన్ అయి ఉండి lrs 2020 మేరకు దరఖాస్తు చేసుకున్నవారు అందుకు ప్రభుత్వం విధించినటువంటి ఛార్జీలను భవన నిర్మాణం కోసం దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
2.2020 ఆగస్టు 26 లోగా రిజిస్ట్రేషన్ అయి ఉండి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని వారు కూడా భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. నిర్దేశించినవంటి చార్జీలతో పాటు 33 శాతం కాంపౌండ్ ఫీజు, 14 శాతం ఖాళీ స్థలం చార్జీలను ప్రస్తుత మార్కెట్ విలువ ఏ విధంగా ఉందో ఆ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
3.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం lrs కోసం దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.
'2015లో ఎల్ఆర్ఎస్' కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులకు నేటితో గడువు ముగియనుంది.
2015లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం LRS కోసం నవంబర్ 2వ తేదీన 'జీవో నెంబర్ 151' ను జారీ చేసింది వారు చెల్లించాల్సినటువంటి రుసుము గడువు నేటితో ముగిసింది.
0 Comments
please do not enter any spam link in the comment box