భారత దేశంలో "పిన్ కోడ్ జోన్లు" గుర్తుపెట్టుకొనే విధానం....
పోటీ పరీక్షల్లో మరో ముఖ్యమైన టాపిక్ "భారత దేశంలో పిన్ కోడ్ జోన్లు" వీటిపై తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది వాటినీ తేలికగా షార్ట్ కట్ రుపంలో వివరించటం జరిగింది.మీకు easy గా ఉండటం కోసం విడియో రూపంలోనూ, టెక్స్ట్ లోనూ,PDF లోనూ అందించటం జరుగుతుంది. వీటిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Topic-indian pincode system.
PIN - POSTAL INDEX NUMBER
PIN అనేది తపాలా సూచిక సంఖ్య.
ఈవిధానము, భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు15న ప్రవేశపెట్టబడింది.
దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్ధిష్టమైన pin నెంబర్ను కేటాయించారు. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది.
PIN లోని అంకెలు
మొదటి అంకె-తపాలా కార్యాలయం గల ప్రాంతాన్ని
రెండవ అంకె-ఉప ప్రాంతాన్ని
మూడవ అంకె-జిల్లాని
నాల్గవ అంకె-మండలాన్ని
ఐదవ అంకె-ప్రధాన పోస్ట్ ఆఫీసు
ఆరవ అంకె-ఉప ప్రధాన పోస్ట్ ఆఫీసు ను తెలియచేస్తాయి.
భారత్ లో 9 పిన్ కోడు ప్రాంతాలు గలవు. ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
Pin code no-1
Cj phd చేసాడు. చీఫ్ జస్టిస్phd చేసాడు. అని గుర్తు పెట్టుకోవాలి
ఇక్కడ
C-చండిఘడ్
J-జమ్మూ కాశ్మీర్
P-పంజాబ్
H-హర్యానా, హిమాచల్ ప్రదేశ్
D-ఢిల్లీ
Total-6
Pin code no-2
U2 అని గుర్తు పెట్టుకోవాలి.
U-ఉత్తరప్రదేశ్
U-ఉత్తరాఖండ్
Total-2
Pin code no-3
రగడ అని గుర్తు పెట్టుకోవాలి
ర-రాజస్థాన్
గ-గుజరాత్
డ-డామన్&డయ్యు, దాద్రా నాగర్ హావేలి
Total-4
Pin code no-4
మామ గోచి అని గుర్తుపెట్టుకోవాలి దీనిలో చ-చార్ అనగా నాలుగు.
మ-మధ్యప్రదేశ్
మ-మహారాష్ట్ర
గో-గోవా
చి-చత్తిస్ గఢ్
Total-4
Pin code no-5.
ఆకతాయి అని గుర్తు పెట్టుకోవాలి
ఆ-ఆంధ్ర ప్రదేశ్
క-కర్ణాటక
త-తెలంగాణ
యు-యానాం
Total-3
Pin code no-6
తల పాక అని గుర్తు పెట్టుకోవాలి.
త-తమిళనాడు
ల-లక్షద్వీప్
పా-పాండిచేరి
కే-కేరళ
Total-4
Pin code no-7
7sisters op కి అస్సాం వెళ్లి అండమాన్ అనే డాక్టర్ ని కలవాలి అని గుర్తు పెట్టుకోవాలి. ఈశాన్యా 7రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు.
అవి1.సిక్కిం2.అరుణాచల్ ప్రదేశ్3.నాగాలాండ్4.మణిపూర్5.మిజోరం6.త్రిపుర7.మేఘాలయ
అస్సాం, op అనగా
O-ఒడిషా
P-పశ్చిమబెంగాల్
అండమాన్&నికోబార్
Total-11
Pin code no-8
బిజీ అని గుర్తు పెట్టుకోవాలి
108 ఎప్పుడు బిజీగా ఉంటుంది.
బి-బీహార్
జి-జార్ఖండ్
Total-2
Pin code no-9
Apo-ఆర్మీ పోస్ట్ ఆఫీస్
Fpo-ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్
Total-28 రాష్ట్రాలు & 8 కేంద్ర పాలిత ప్రాంతాలు.
భారత దేశంలో పిన్ కోడ్ జోన్లు గుర్తుపెట్టుకొనే విధానం👇👇
PIN CODE ZONES : CLICK HERE
0 Comments
please do not enter any spam link in the comment box