జేఈఈ మెయిన్ -2 అడ్మిట్ కార్డులు
JEE Main-2 | దేశంలోనే పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ /బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE MAIN-2023) రెండో విడత ఎంట్రన్స్‌కు అడ్మిట్ కార్డులు విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు www,nta.ac,in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ల నుంచి తమ
దేశంలోని 330 నగరాల పరిధిలో ఈ నెల 6,8,10,11,12,13,15 తేదీల్లో జేఈఈ-మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరుగనున్నది. విదేశాల్లో 15 నగరాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 9.4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.*
ఒకవేళ జేఈఈ మెయిన్ రెండో దశ అడ్మిట్ కార్డు పొందడంలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు.. ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్ 011-40759000 ఫోన్ నంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫోన్ చేసి సంప్రదించి, తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో టాప్ స్కోర్ సాధించే 2.50 లక్షల మంది విద్యార్థులు జూన్ నాలుగో తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కావాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు.*
*GSRAO GK GROUPS*
0 Comments
please do not enter any spam link in the comment box