ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
( ఆంధ్రప్రదేశ్ IIIT )రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-CET) ప్రవేశ పరీక్షలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు.
పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే.
RGUKT కౌన్సిలింగ్ : జనవరి 4 నుంచి
RESULT DIRECT LINK : CLICK HERE
WEBSITE : CLICK HERE
RGUKT CET 2020 : CLICK HERE


0 Comments
please do not enter any spam link in the comment box