LATEST POSTS

10/recent/ticker-posts

which gives special powers to Jammu and Kashmir || జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ -370 గురించి

 ఆర్టికల్ -370.(జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు)

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు ఆర్టికల్ -370.

దేశంలో అసెంబ్లీ తో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?

1.భారత రాజ్యాంగం లోని 21వ భాగంలోని ఆర్టికల్ 370ప్రకారం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమలు ఉండడం.

2.ఆర్టికల్-35 (A) అనగా-కాశ్మీర్ లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధన.

3.ఏ ఆర్టికల్ ను ఉపయోగించి కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కున్న స్వయం ప్రతిపత్తిని రద్దుచేసింది-ఆర్టికల్-370 క్లాజ్(3)

ఆర్టికల్-370 క్లాజ్(3) ఏం చెబుతుంది....

1.భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలో నైనా ఆర్టికల్-370 అమలును నిలిపివేసే లేదా సవరించే అధికారం ఉంది.

2.జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతి పతి రద్దు, పునవ్యవస్థీకరణ బిల్లు-2019 ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఏ సభలో ప్రవేశపెట్టారు-రాజ్యసభ.

3.ఎప్పుడు ప్రవేశం-2019 ఆగస్ట్-5(ఆమోదం కూడా)

4.లోక్ సభ ఆమోదం-2019 ఆగస్ట్-6

5.ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి లోక్ సభలో ఎంత మెజారిటీ లభించింది-351:72

6.పార్లమెంట్ సిఫార్స్ మేరకు, మొదటి క్లాజ్ మినహా ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనల అమలు ఏ తేదీ నుంచి నిర్వీర్యం చేసినట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు-2019 ఆగస్ట్-5.

7.ఏ పేరుతో ఆర్టికల్-370 రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి జారీచేశారు-రాజ్యాంగం(జమ్మూ కాశ్మీర్ కు వర్తింపు)ఉత్తర్వులు-2019.

8.ఆర్టికల్ 370 క్లాజ్(3) లో  రాష్ట్ర రాజ్యాంగ శాసనసభ కు బదులుగా ఇప్పుడు ఏమని చదవాలి-రాష్ట్ర లేజిస్లేటివ్ అసెంబ్లీ.

9.జమ్మూకాశ్మీర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు-అసెంబ్లీ తో కూడిన జమ్మూ కాశ్మీర్

10.అసెంబ్లీ లేని లడఖ్.

11.ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య-28 రాష్ట్రాలు,8 కేంద్రపాలిత ప్రాంతాలు....

12.దేశంలో అసెంబ్లీ తో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని-3

1.ఢిల్లీ-70

2.పుదుచ్చేరి-

3.జమ్మూకాశ్మీర్-114

13.జమ్మూ కాశ్మీర్ లోక్ సభ స్థానాలు-5.

14.ఉమ్మడి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి-22

15.మతాల పరంగా జమ్మూకాశ్మీర్ లో జనాభా....

ముస్లింలు-68.31%

హిందువులు-28.43%

సిక్కులు-1.87%

16.రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు-లడఖ్

17.జమ్మూ కాశ్మీర్ అధికార భాష-ఉర్దూ

18.ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం-జమ్మూ కాశ్మీర్(125,535km2)

19.చిన్నది-లక్షద్వీప్(32.62km)

20.జమ్మూ కాశ్మీర్ లో ఏ సంవత్సరం వరకు లోక్ సభ నియోజక వర్గాల పెంపు చేయరాదన్న నిబంధన అమలులో ఉంది-2026.

21.జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించిన గ్రంధం-కల్హణుడు రాసిన రాజతరంగణి.

22.ఏ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగo గా ఆవిర్భవించింది-అమృతసర్ ఒప్పందం..

23.అమృత సర్ ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది-జమ్మూ పాలకుడు గులాబ్ సింగ్ కు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మధ్య...

24.స్వాతంత్ర్య పూర్వం దేశంలోని మొత్తం సంస్థానాల సంఖ్య-562

25.స్వాతంత్ర్య అనంతరం ఇండియాలో విలీనానికి ఒప్పుకోని సంస్థానాలు-3

1.జమ్మూ కాశ్మీర్

2.హైదరాబాద్

3.జునాఘడ్.

26.జమ్మూకాశ్మీర్ లో తొలి రాజకీయ పార్టీని ఎవరు స్థాపించారు-షేక్ అబ్దుల్లా

27.పార్టీ-కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్-1932

28.షేర్-ఏ కాశ్మీర్ గా ఎవరిని పిలుస్తారు-షేక్ అబ్దుల్లా.

29.జమ్మూ కాశ్మీర్ పై పాకిస్థాన్ ఎప్పుడు దండయాత్ర చేసింది-1947- అక్టోబర్-20.

30.భారత్-పాక్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) ను ఎప్పుడు నిర్ణయించారు-1949 జనవరి-1.

నోట్ : ... జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేకమైన 370 ఆర్టికల్ ను ఎవరు రూపొందించారు-గోపాలస్వామి అయ్యంగార్....

కొపనాతి.వీర్రాజు


Post a Comment

0 Comments