LATEST POSTS

10/recent/ticker-posts

TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట

TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట  

TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట

TS TET-2022 SPECIAL || 5వ తరగతి తెలుగు || 2.యాదగిరిగుట్ట 

25 ముఖ్యమైన ప్రశ్నలు

1)యాదగిరిగుట్ట పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?

A:  దర్శనీయ స్థలాలు,సంస్క్రతి

2) యాదగిరిగుట్ట పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?

A: వ్యాసం

3)యాదగిరిగుట్ట పాఠం ఉద్ధేశం ఏమిటి?.

A: తెలుగునేలలో పేరుపొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం

4) తెలంగాణలో గొప్ప కీర్తికెక్కిన పుణ్యక్షేత్రం ఏది?

A: యాదగిరిగుట్ట

5)యాదగిరిగుట్ట లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?

A: నరసింహస్వామి

6)యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు ?

A: యాదాద్రి(పూర్వం నల్లగొండ)

7) యాదగిరిగుట్ట హైదరాబాదు కు ఎంత దూరం లో కలదు ?

A: 60km

8) యాదర్షి ఎవరి కుమారుడు?

A: ఋష్యశృంగుని కొడుకు

9)ఎవరి పేరున యాదగిరిగుట్ట కు ఆ పేరు వచ్చింది?

A: యాదర్షి

10) దేదీప్యమానం అనగా  అర్థం ఏమిటి?

A: బాగా వెలిగేటి కాంతి

11)కల్పతరువు అనగా  అర్థం ఏమిటి?

A: కోరికలు తీర్చే చెట్టు,దేవలోక వృక్షం

12) యాదగిరిగుట్ట దగ్గర దేనిని పుణ్యకార్యక్రమంగా భావిస్తారు ?

A: గోశాలకు ఆవులను దానం చేయడం

13)యాదగిరిగుట్ట పైన గల గుండం పేరేమిటి?

A: విష్ణు గుండం

14)ఈ కొండపై గల మరొక దేవాలయం ఏది?

A: రామలింగేశ్వరాలయం

 15)నరసింహ ఆలయంలో  స్వామివారికి అష్టోత్తరశత  కలశాభిషేకం  ఎప్పుడు జరుగుతుంది?

A: ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున

16) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి?

A: 11 రోజులు

17) తొవ్వ అనగా  అర్థం ఏమిటి ?

A: దారి,మార్గం

18) సప్తగిరి చానెల్ ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?

A: యాదగిరి.

19) కొండగుట్ట మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు?.

A: కరీంనగర్

20) కొండగుట్టలో వెలిసిన దేవుడు ఎవరు?

A: ఆంజనేయస్వామి

21) హనుమాన్ దీక్ష చేపట్టిన వారు ఎన్ని రోజులపాటు నిష్ఠగా ఉంటారు?

A: 41రోజులు

22)  అజయ్ అనే విద్యార్థి యాదగిరిగుట్ట పాఠం విని వారి ఊరిలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేసాడు .అయిన అతను సాధించిన సామర్థ్యం ఏమిటి?

A: సృజనాత్మకథ.

23) జరిగిపోయిన పనిని గురించి తెలిపే పదాలున్న వాక్యాలను ఏమంటారు?.

A: భూతకాలపు వాక్యాలు

24)జరుగుతున్న పనిని తెలిపే వాక్యాలను ఏమంటారు ?

A: వర్తమానకాలపు వాక్యాలు

25)జరగబోయే పనులు గురించి తెలిపే వాక్యాలను ఏమంటారు ?

A: భవిష్యత్ కాలపు వాక్యాలు

Pre by : G SURESH


Post a Comment

0 Comments